3 వారాల్లోనే 150 శాతం పెరిగిన బ్లాక్ ఫంగస్ కేసులు

by సూర్య | Fri, Jun 11, 2021, 04:16 PM

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న బాధితులను బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. మూడు వారాల్లోనే 31,216 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్‌తో 2,109 మంది చనిపోయారని తెలిపారు. అయితే బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే అంఫోటెరిసిన్-బీ ఔషధం కూడా తీవ్రంగా కొరత ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 7,057 కేసులు నమోదు కాగా, 609 మంది చనిపోయారు. గుజరాత్‌లో 5,418 "మరణాలు 323", రాజస్థాన్‌లో 2,976 కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటకలో 188 మంది ప్రాణాలు కోల్పోయారు. మే 25వ తేదీన మహారాష్ట్రలో 2,770, గుజరాత్‌లో 2,859 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. యూపీలో 142 మంది, ఢిల్లీలో 125 మంది చనిపోయారు. బెంగాల్‌లో కేవలం 23 మంది మాత్రమే చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM