రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్ర అల్పపీడనం

by సూర్య | Thu, Jun 10, 2021, 04:15 PM

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశావైపు అల్పపీడనం కదులుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రకు రెండ్రోజులపాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో విశాఖపట్టణం తీరం వెంబడి గంటకు 45-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ సందర్భంగా సముద్రంలో చేపల వేటకు మత్య్సకారులు ఎవరూ వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Latest News

 
ఏపీలో మరో ఘోరం.. చిత్తూరు జిల్లాలో రెండులారీలు, ట్రాక్టర్ ఢీ. Wed, May 15, 2024, 11:24 PM
వైఎస్ జగన్ నివాసంలో ముగిసిన 41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగం Wed, May 15, 2024, 11:19 PM
రూ.3500 సాయం అడిగింది నేనే.. నా అకౌంట్ హ్యాక్ కాలేదు: రేణూ దేశాయ్ Wed, May 15, 2024, 09:50 PM
ఏపీలో మరో మూడురోజులు వానలు.. రేపు ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ Wed, May 15, 2024, 09:49 PM
ఏపీలోని ఈ నియోజకవర్గాల్లో 144 సెక్షన్.. ప్రజల్ని అలర్ట్ చేసిన పోలీసులు Wed, May 15, 2024, 08:38 PM