నోబెల్ బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీపై రాజద్రోహం కేసు

by సూర్య | Thu, Jun 10, 2021, 03:15 PM

మయన్మార్ లో సైనిక ప్రభుత్వం నిర్బంధంలో ఉన్న మాజీ నేత ఆంగ్ సాన్ సూకీపై అవినీతి ఆరోపణలు మోపింది. ఆమె అక్రమంగా లక్షల డాలర్లు, బంగారం తీసుకున్నారని, తన చారిటబుల్ ట్రస్ట్ కోసం చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని పేర్కొంది. ఆమె.. గత ఫిబ్రవరి 1 నుంచి సైనిక ప్రభుత్వ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే..ఆమెపై రాజద్రోహం కేసును కూడా మోపారు. తన నుంచి ఆమె అక్రమంగా 6 లక్షల డాలర్ల నగదును, 11 కిలోల బంగారాన్ని తీసుకున్నారని యాంగూన్ మాజీ సీఎం ఒకరు ఆరోపించారు. అయితే ఆమె ఎందుకీ సొమ్మును, గోల్డ్ ను తీసుకున్నారో ఆయన వెల్లడించలేదు. ఆంగ్ సాన్ తన పదవిని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అవినీతి నిరోధక కమిషన్ కనుగొన్నదని గ్లోబల్ న్యూలైట్ మయన్మార్ డైలీ తెలిపింది. 


తన చారిటబుల్ ట్రస్ట్ కోసం ఆమె రెండు ఖరీదైన భవనాలను అద్దెకు ఇచ్చారని కూడా ఈ కమిషన్ కనుగొన్నట్టు ఈ పత్రిక పేర్కొంది. తాజాగా ఇన్నాళ్లూ సాదాసీదా ఆరోపణలపై ఆమెపై కోర్టులో విచారణ జరిగేలా చూసేందుకు యత్నించిన సైనిక ప్రభుత్వం ఇప్పుడు దారుణమైన ఆరోపణలు మోపిందని ఆమె తరఫు లాయర్ మండిపడ్డారు. ఈ ఆరోపణలు నిరాధారాలని, తన క్లయింటును దేశం నుంచి విడిచి వెళ్లేలా చూడడానికే ఈ ప్రభుత్వం ఈ అభియోగాలు మోపిందని ఆయన అంటున్నారు. కాగా వచ్చే వారం ఆంగ్ సాన్ సూకీని కోర్టు మళ్ళీ మూడో సారి విచారించనుంది. నిర్బంధంలో ఉన్న ఆమెను విడుదల చేయాలంటూ దేశ వ్యాప్తంగా వేలమంది నిరసన ప్రదర్శనలు చేశారు. ఇప్పటివరకు జరిగిన హింసలో 800 మందికి పైగా మరణించగా వెయ్యిమందికి పైగా గాయపడ్డారు.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM