కరోనా లేని గ్రామంగా 'ముండాజె'

by సూర్య | Thu, Jun 10, 2021, 02:54 PM

 కర్ణాటక రాష్ట్రాన్ని రెండోదశ కరోనా వైరస్‌ గజగజ వణికించింది. నగరాలు, పట్టణాలే కాకుండా అనేక గ్రామాల ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేసింది. అయితే ఆశ్చర్యకరంగా చిక్క మగళూరు జిల్లాలోని మళవంతిగె గ్రామపంచాయతీ పరిధిలోని ముండాజె అనే గ్రామంలో ఏడాదికాలంగా కరోనా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ పొందారు. ఈ గ్రామంలో కరోనా జాడ లేకుండా చేయడంలో గ్రామస్తు లు కలసికట్టుగా కృషి చేశారు. గ్రామంలో 136 కుటుంబాలు నివసిస్తున్నాయి. జనాభా 632గా ఉంది. కరోనా వైరస్‌ తీవ్రమైన సందర్భంలో ప్రజలు కలసికట్టుగా గ్రామంలోకి ఎవరినీ అనుమతించలేదు. ముందస్తుగా గ్రామస్తులంతా కరోనా వైద్య పరీక్షలు నిర్వహించుకు న్నారు. అందరికీ నెగటివ్‌ రావడంతో మాస్కులు ధరిస్తూ అన్ని జాగ్రత్తలు పాటించారు. నిత్యావసర, ఇతర అవసరాలకోసం గ్రామం వదలాల్సిన సమయంలో అన్ని జాగ్రత్తలు పాటించేవారు. పంచాయతీ ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌ వేయించారు. ఉత్సాహభరితంగా అర్హులైన వారంతా టీకాలు పొందారు. మొత్తానికి కరోనాను జయించిన ఈ గ్రామానికి సంబంధించిన కథనాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అన్ని గ్రామాలు ఇలా కలసికట్టుగా కృషి చేస్తే కరోనాను జయించడం పెద్ద కష్టం ఏమీ కాదని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఈశ్వరప్ప బుధవారం ట్వీట్‌ చేశారు. గ్రామస్తులను ప్రత్యేకంగా అభినందించారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM