ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్ ఇవే

by సూర్య | Thu, Jun 10, 2021, 02:39 PM

ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు చేసింది. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ నుంచి సడలింపు అమల్లో ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో రేపటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లు, ఎస్పీలకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపటి నుంచి ఈ నెల 20 వరకు కర్ఫ్యూ సడలింపు చేయాలని సింఘాలు ఆదేశించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కఠినంగా కర్ఫ్యూ అమలు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. కర్ఫ్యూ సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. అటు ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Latest News

 
భక్తులతో కిటకిటలాడిన మాలకొండ దివ్యక్షేత్రం Sat, Apr 20, 2024, 12:53 PM
23న చీరాలలో షర్మిల రోడ్ షో... ఆమంచి నామినేషన్ Sat, Apr 20, 2024, 12:51 PM
బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారు Sat, Apr 20, 2024, 12:49 PM
టిడిపి జనసేన ను వీడి వైసీపీలో చేరిన వంద కుటుంబాలు Sat, Apr 20, 2024, 12:49 PM
పెద్దాపురంలో టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు Sat, Apr 20, 2024, 12:49 PM