దేశంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు

by సూర్య | Thu, Jun 10, 2021, 11:34 AM

దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా కేసుల నుంచి కోలుకుంటున్న సమయంలో.. దేశంలో కరోనా మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. బుధవారం కరోనా బారిన పడి 6,148 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా ప్రారంభం నాటినుంచి ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే మోదటిసారి. కాగా.. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 94,052 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,91,83,121 కి పెరగగా.. మరణాల సంఖ్య 3,59,676 కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.


ఇదిలాఉంటే.. నిన్న ఈ మహమ్మారి నుంచి 1,51,367 బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2,76,55,493 కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,67,952 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 23,90,58,360 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Latest News

 
చిలమత్తూరు ఎంపీపీ, మరో 35 మందిపై కేసు Fri, May 17, 2024, 02:45 PM
ఎం పి ఎల్ ట్రోఫీ ఆవిష్కరణ Fri, May 17, 2024, 02:31 PM
మళ్లీ అధికారంలోకి వస్తాం: సజ్జల Fri, May 17, 2024, 02:30 PM
కారు ఇంజిన్‌ వేడెక్కి దగ్ధం Fri, May 17, 2024, 02:25 PM
ధాన్యం కొనుగోళ్లు డబ్బులు చెల్లించాలి Fri, May 17, 2024, 02:24 PM