నైజీరియాలో రోడ్డుప్రమాదం.. 18 మంది ప్రయాణికులు మృతి

by సూర్య | Thu, Jun 10, 2021, 11:15 AM

నైజీరియా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టడంతో 18 మంది దుర్మరణంపాలయ్యారు. ఉత్తర నైజీరియాలోని జిగవా ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు సంఘటన స్థలంలోనే మరణించారని జిగవా పోలీసు అధికార ప్రతినిధి లావాన్ షీశు చెప్పారు. పదుల సంఖ్యలో ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించి సమాచారం అందగానే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యల చేపట్టామని, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓ బస్సు డ్రైవరు కాలు విరగడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. నైజీరియా దేశంలో అధ్వానంగా మారిన రోడ్లు, ఓవర్ లోడింగ్, రాష్ డ్రైవింగ్ వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM