పెట్రోల్‌ ధరల పెరుగుదలపై 11న కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఆందోళన

by సూర్య | Wed, Jun 09, 2021, 10:01 AM

న్యూఢిల్లీ : గత కొద్ది రోజులుగా ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా పెట్రోల్‌ పంపుల ఎదుట నిరసన చేపడుతారని పార్టీ పేర్కొంది. ఇటీవల ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. మహమ్మారి సమయంలో దేశంలో పన్ను వసూళ్ల విపత్తు నిరంతరంగా కొనసాగుతుందని ఆరోపించారు.


జూన్‌లో బుధవారం నాటికి చమురు కంపెనీలు ఐదు సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. బుధవారం పెంచిన ధరలతో దేశ రాజధానిలో ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకోగా.. లీటర్‌ పెట్రోల్‌ రూ.95.56, డీజిల్‌ రూ.86.47కి చేరింది. మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు చమురు ధరలు 22వ సార్లు పెరిగాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేవ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు లడాఖ్‌లో లీటర్ పెట్రోల్‌ రూ.100 దాటింది. దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో పెట్రోల్‌ రూ.106.39, డీజిల్‌ రూ.99.24కు చేరింది.

Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM