దేశంలో 23.88 కోట్ల కొవిడ్‌ టీకాల పంపిణీ

by సూర్య | Wed, Jun 09, 2021, 08:47 AM

న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్‌ టీకాల పంపిణీ 24కోట్లకు చేరువైంది. మంగళవారం రాత్రి 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు.. మొత్తం 23,88,40,635 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మంగళవారం 18-44 ఏళ్లలోపు వారిలో 13,32,471 మంది మొదటి డోసు, 76,723 మంది లబ్ధిదారులు రెండో మోతాదు తీసుకున్నారని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇప్పటి వరకు టీకాల్లో హెల్త్‌కేర్‌ వర్కర్లకు 99,95,552 మొదటి డోసు.. 68,91,662 రెండో డోసు వేశారు. ఫంట్‌లైన్‌ వర్కర్లలో 1,63,80,521 మొదటి, మరో 87,26,071 మందికి రెండో డోసు.. 18-44 ఏళ్ల వయస్సు ఏజ్‌గ్రూప్‌లో 3,17,37,869 మంది లబ్ధిదారులకు మొదటి, 3,16,134 మందికి రెండో మోతాదు అందజేసినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది.


45-60 ఏజ్‌గ్రూప్‌లో 7,25,46,765 మందికి తొలి.. 1,15,34,478 మందికి రెండో మోతాదు వేసినట్లు పేర్కొంది. 60 ఏళ్లుపైబడిన 6,12,75,505 మంది లబ్ధిదారులకు మొదటి.. 1,94,36,078 మందికి సెకండ్‌ డోసు అందజేసినట్లు తెలిపింది. టీకా డ్రైవ్‌ మంగళవారం 144వ రోజుకు చేరగా.. ఒకే రోజు 25,58,652 డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది. 22,67,842 మందికి మొదటి.. 2,90,810 రెండో మోతాదు వ్యాక్సిన్‌ వేసినట్లు వివరించింది.

Latest News

 
కారు బైక్ ఢీ వ్యక్తి మృతి Fri, May 03, 2024, 12:00 PM
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM
సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎస్సై Fri, May 03, 2024, 10:31 AM