బాలిక విజ్ఞప్తికి చలించిన సీఎం

by సూర్య | Sun, Jun 06, 2021, 03:40 PM

సీఎం సార్…చిన్న గదిలో నివాసం ఉంటున్నాం..పేదరికంతో సమస్యలు ఎదుర్కొంటున్నాం. చదువుకోవడానికి టేబుల్ లేదు.. కోవిడ్ సోకిన అమ్మకు మందులు కూడా లేవు. ప్లీజ్..ఆదుకోండి అంటూ..14 ఏళ్ల బాలిక చేసిన విజ్ఞప్తికి సీఎం చలించిపోయారు. వెంటనే ఆమె అడిగిన వస్తువులను పంపించారు. ఈ సందర్భంగా…బాలిక కుటుంబసభ్యులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన త్రిపురలో చోటు చేసుకుంది. త్రిపురలో బర్గా దాస్ అనే 14 ఏళ్ల బాలిక తల్లదండ్రులతో నివాసం ఉంటోంది. ఈమె 8వ తరగతి చదువుతోంది. ఇటీవలే సీఎం బిప్లబ్ దేబ్ కు సోషల్ మీడియా ద్వారా ఒక విజ్ఞప్తి చేసింది. తాము చిన్న గదిలో నలుగురు కుటుంబసభ్యులు నివాసం ఉంటున్నామని, తనకు చదువుకోవడానికి స్టడీ టేబుల్ లేదని వెల్లడించింది. తన తల్లికి ఇటీవలే కోవిడ్ సోకిందని ఆవేదన వ్యక్తం చేసింది.


కనీసం మందులు కొనుక్కోవడానికి అవసరమైన డబ్బు లేదని తెలిపింది. తన తండ్రికి చిన్నపాటి పని చేస్తుండడంతో సమస్యలు ఎదుర్కొంటున్నామని వెల్లడించింది. ఈ విషయం సీఎం బిప్లబ్ దృష్టికి వచ్చింది. బాలిక పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని చలించిపోయారు. బాలిక ఇంటి వద్దకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చేరుకున్నారు. స్టడీ టేబుల్, తల్లికి అవసరమైన కోవిడ్ మందులు, ఫుడ్ ప్యాకెట్లు అందచేశారు. సీఎం స్పందించడంతో బాలిక తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. 

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM