సీఐ వేధింపులు తట్టుకోలేక మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం

by సూర్య | Sun, Jun 06, 2021, 03:20 PM

సీఐ వేధింపులు తాళలేక మహిళా హోంగార్డు శానిటైజర్‌ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌ జిల్లా ఆదోని పట్టణంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలిని స్థానికులు హుటాహుటిన దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆత్మహత్యాయత్నానికి ముందు తన ఆవేదనను ఓ సెల్పీ వీడియోలో రికార్డు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఎమిగనూర్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తించే రామకృష్ణమ్మ ఇటీవల బదిలీపై ఆదోని 3 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీపై వచ్చింది. వచ్చిన నాటి నుంచి సీఐ నరేష్‌ ఆమెను ఎందుకు వచ్చావు.. పనిష్మెంటా.? వివాదమా.? అంటూ ప్రశ్నిస్తూ ఇటీవల ఆమె పాస్‌పోర్టును తిప్పించాడు. తన పాస్‌పోర్టును ఎందుకు తిప్పి పంపారంటూ సీఐని ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా మాట్లాడి అవమానించారని రామకృష్ణమ్మ సెల్ఫీ వీడియోలో వాపోయింది. తనను మానసిక క్షోభకు గురిచేసిన సీఐని కఠినంగా శిక్షించాలని రామకృష్ణమ్మ డిమాండ్‌ చేసింది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM