భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ బ్లూ టిక్ తొలగించిన యాజమాన్యం

by సూర్య | Sat, Jun 05, 2021, 10:50 AM

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ అకౌంట్‌కి ఉన్న బ్లూ టిక్‌ను ట్విట్టర్ యాజమాన్యం తొలగించింది. సాధారణంగా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులకు, సంస్థల ట్వట్టర్ అకౌంట్‌లకు బ్లూ టిక్‌ను అందిస్తారనే విషయం తెలిసిందే. ఇదిలా ఉండే అధికారిక ఉపరాష్ట్రతి సెక్రటేరియట్ ట్విట్టర్ హాండిల్‌కు బ్లూ టిక్ అలాగే కొనసాగుతోంది. ఉపరాష్ట్రపతి లాంటి ఉన్నత హోదాలో ఉన్నవ్యక్తి ఐడీ బ్లూ టిక్‌ను తొలగించడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే వెంకయ్య నాయుడు ట్విట్టర్ ఖాతా కొన్ని రోజులుగా క్రీయాశీలకంగా లేదని అందుకే ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుందనే వాదన వినిపిస్తోంది. కొన్ని నెలలుగా క్రియాశీలకంగా లేని అకౌంట్‌లకు వెరిఫైడ్ బ్లూ టిక్‌ను తొలిగిస్తామని ట్విట్టర్ తన నియమనిబంధనలో తెలిపింది. ఇక సోషల్ మీడియాపై భారత ప్రభుత్వం విధిస్తోన్న పలు నిబంధనల నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ సంఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఈ వివాదంపై ట్విట్టర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM