వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తింపు కొనసాగుతుంది : ఢిల్లీ హైకోర్టు

by సూర్య | Fri, Jun 04, 2021, 12:14 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తింపు కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ మేరకు తీర్పునిచ్చింది. కాగా వైఎస్సార్‌ అన్న పదం తమకే చెందుతుందని అన్న వైఎస్సార్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. వైఎస్సార్‌సీపీ రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో శుక్రవారం ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. తప్పుడు ఉద్దేశాలతో కేసు వేశారని పేర్కొంటూ అన్న వైఎస్సార్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. అన్నవైఎస్సార్‌ పిటిషన్‌కు ఎలాంటి మెరిట్‌ లేదన్న న్యాయస్థానం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Latest News

 
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM
మూడు నెలల్లో రెండు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ సొంత జిల్లాలోనే! Mon, Apr 29, 2024, 08:06 PM
టీడీపీకి భారీ ఊరట.. ఆ నియోజకవర్గాల్లో నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న రెబల్ అభ్యర్థులు Mon, Apr 29, 2024, 08:02 PM