" పీఎం ఈ-విద్య " ద్వారా అన్ని తరగతులకు ఉచితంగా ఆన్​లైన్ ఎడ్యుకేషన్.!

by సూర్య | Mon, May 31, 2021, 12:06 PM

కరోనా వైరస్ ప్రభావం వల్ల లాక్​డౌన్ కొనసాగుతుండడంతో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. విద్యార్థులకు ఆఫ్​లైన్​ క్లాసులు జరగడం లేదు. దీంతో ప్రస్తుతం అంతా డిజిటల్ ఎడ్యుకేషన్ నడుస్తోంది. స్కూళ్లు, కాలేజీలు ఆన్​లైన్ ద్వారానే పాఠాలు బోధిస్తున్నాయి. కాగా ఆన్​లైన్ లెర్నింగ్​ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాదే పీఎం ఈ-విద్య " PM e-Vidya "ను ప్రారంభించింది. దీనిలో నాలుగు విభాగాలు ఉంటాయి. స్కూల్ ఎడ్యుకేషన్ కోసం నాలుగు, ఉన్నత విద్య కోసం రెండు విభాగాలు ఉన్నాయి. స్వయంప్రభ " Swayam Prabha " అధికారిక వెబ్​సైట్​లో ఈ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉంటాయి. కంటిచూపు లేని వారి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం... ప్రత్యేక రేడియో పోడ్​కాస్ట్ ద్వారా పీఎం ఈ-విద్యను నడిపిస్తోంది. అలాగే ఇంటర్నెంట్ సౌకర్యం లేని వారి కోసం టీవీ చానెల్ ద్వారా విద్యను అందిస్తోంది. పీఎం ఈ-విద్య పరిధిలోనే దీక్ష " DIKSHA ", నిష్ట " NISHTHA " అనే రెండు పోర్టల్స్ కూడా ఉన్నాయి.


దీక్ష  "DIKSHA) " అంటే


దీక్ష ద్వారా ఎన్​సీఆర్​టీ, ఎన్​ఐఓఎస్​, సీబీఎస్​ఈ పుస్తకాలతో పాటు వాటికి సంబంధించిన టాపిక్స్​ను ఆన్​లైన్​ క్లాసెస్​ ద్వారా ఈ విభాగంలో బోధిస్తారు. యాప్​లోని క్యూఆర్​ కోడ్​ను స్కాన్ చేసి విద్యార్థులు పోర్టల్​లోని 2,685 కోర్సులను వినియోగించుకోవచ్చు. దీక్ష ప్రోగ్రాంలో ఇప్పటికే 8.46 మంది విద్యార్థులు ఎన్‌రోల్ అయి ఉన్నారు. ఈ దీక్ష పోర్టల్​లో మొత్తం 2,775 కోట్ల లెర్నింగ్ నిమిషాలు ఉన్నాయి.


నిష్ట  " NISHTHA " అంటే


ది నేషనల్​ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్​ అండ్​ టీచర్స్​ హోలిస్టిక్​ అడ్వాన్స్​మెంట్ " NISHTHA " ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వం టీచర్లకు ట్రైనింగ్​ ఇస్తోంది. ఎలిమెంటరీ స్థాయిలో టీచింగ్​ను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తెచ్చింది. 11 బాషల్లో ఇది అందుబాటులో ఉంది.


మెంటల్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ లాక్ ​డౌన్ లాంటి క్లిష్టసమయాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మానసికంగా దృఢంగా ఉండేందుకు మనోదర్పన్ " Manodarpan " అనే పోర్టల్​ను కూడా పీఎం ఈ-విద్య కింద ప్రభుత్వం నిర్వహిస్తోంది. మానసికంగా ఏదైనా సమస్య అనిపిస్తే కౌన్సింలింగ్,​ గైడెన్స్ ఈ పోర్టల్ ద్వారా పొందవచ్చు. దీనిలో 308 లైవ్ సెషన్లు ఉంటాయి. అలాగే టీచర్ల కోసం ప్రత్యేకం మరో 45 లైన్ సెషన్లు ఉన్నాయి. విద్య సంబంధిత వీడియోలను ప్రసారం చేసేందుకు పీఎం ఈ-విద్య.. టాటా స్కై, ఎయిర్​టెల్ లాంటి ప్రైవేటు డీటీహెచ్ ఆపరేటర్లతోనూ చేతులు కలిపింది. అలాగే ఈ-పాఠశాల పోర్టల్​లో 200 కొత్త టెక్ట్స్​ బుక్​లను యాడ్ చేసింది. సీఐఈటీ, ఎన్​సీఈఆర్​టీ డెవలప్​చేసిన ఈ విద్య పోర్టల్​/యాప్​ టీచర్లు, విద్యార్థులు, ఎడ్యుకేటర్స్​, తల్లిదండ్రులకు అన్ని రకాల టెక్ట్స్​బుక్స్​ను అందుబాటులోకి తెచ్చింది.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM