అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాము : మంత్రి కొడాలి నాని

by సూర్య | Sun, May 30, 2021, 11:42 AM

ఏపీలో వైసీపీ ప్రభుత్వం పరిపాలన చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.తమ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేస్తోందని చెప్పారు. రెండేళ్లలో సంక్షేమ కార్యక్రమాలను పెద్దఎత్తున అమలు చేశామని తెలిపారు. జగన్ మాత్రం ప్రజల మద్దతుతో ఎన్నికయ్యారని చెప్పుకొచ్చారు. తాము కరోనా సంక్షోభం సమంయలోనూ ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గంటకో మాట, పూటకో మాట మాట్లాడుతారని ఆయన విమర్శించారు. ప్రజల సొమ్మును దోచుకున్న వారిని తాము వదిలిపెట్టబోమని తెలిపారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, అలాగే, కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని లోకేశ్ మళ్లీ అధికారంలోకి వస్తాడా? అని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకుని వచ్చినా చంద్రబాబు నాయుడు గెలవలేడని ఆయన జోస్యం చెప్పారు. కరోనా వల్ల అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశామని చెప్పారు. జగన్‌ బాటలోనే కేంద్ర ప్రభుత్వం కూడా నడిచిందని చెప్పుకొచ్చారు. జగన్ పాలనలో విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఆయన చెప్పారు. కానీ, చంద్రబాబు మాత్రం ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు అడ్డమైన హామీలు ఇచ్చారని నాని అన్నారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM