కోవిడ్‌ పేషెంట్ల కోసం ఆక్సిజన్‌ బస్సులు ఏర్పాటు : మంత్రి పేర్ని నాని

by సూర్య | Thu, May 27, 2021, 02:57 PM

కోవిడ్‌ పేషెంట్లకు ఆక్సిజన్‌ అందించేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వెన్నెల స్లీపర్‌, ఏసీ బస్సుల్లో ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆస్పత్రుల్లో బెడ్లు కొరత ఉన్న ప్రాంతాల్లో కోవిడ్‌ పేషెంట్లకు బస్సుల్లోనే వైద్యసేవలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రయోగాత్మకంగా వెన్నెల బస్సులో 10 ఆక్సిజన్‌ బెడ్లు ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఒక్కో ఆర్టీసీ స్లీపర్‌ బస్సులో 10 మంది పేషెంట్లకు చికిత్స అందిస్తామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆస్పత్రులు అందుబాటులోలేని ప్రాంతాల్లో ఆక్సిజన్‌ బస్సులు ద్వారా సేవలు అందిస్తామని మంత్రి వెల్లడించారు. 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM