ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న రఘురామకృష్ణరాజు

by సూర్య | Thu, May 27, 2021, 02:39 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై రఘురామపై ఏపీ సీఐడీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసి గుంటూరు జైలుకు తరలించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు చికిత్స అందించారు. అనంతరం రఘురామరాజుకు బెయిల్ మంజూరు చేస్తూ మే 21న సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. నిన్న ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఢిల్లీ వెళ్లిన రఘురామ.. ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కాలి గాయాలు తగ్గకపోవడం, నొప్పి ఎక్కువగా ఉండడంతోపాటు బీపీ నియంత్రణలోకి రాకపోవడంతో ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు రఘురామ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ ఆరా తీశారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు. రఘురామను హర్షవర్దన్‌ ఫోన్‌లో పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కేసు గురించి మీడియాతోగానీ, సోషల్ మీడియాలో గానీ మాట్లాడవద్దని సుప్రీంకోర్టు షరతు విధించింది. 

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM