కొవిడ్ రెండు డోసుల టీకా తీసుకున్న భారత యువకుడికి కరోనా

by సూర్య | Mon, Apr 12, 2021, 11:11 AM

సింగపూర్ : కొవిడ్ రెండు డోసుల టీకాలు తీసుకున్నాక కూడా భారత యువకుడికి కరోనా సోకడం సింగపూర్ దేశంలో సంచలనం రేపింది. కొవిడ్-19 రెండు డోసుల టీకా తీసుకొని వర్క్ పర్మిట్‌పై సింగపూర్ దేశానికి వచ్చిన భారత యువకుడు కరోనా బారిన పడ్డారు. సింగపూర్ దేశంలో 20 కరోనా కేసులు వెలుగుచూడగా వారిలో కొవిడ్ టీకాలు వేసుకున్నాక కూడా భారత యువకుడికి కరోనా సోకిందని తేలింది.కరోనా సోకిన యువకుడిని వెంటనే ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. రెండు సార్లు జరిపిన పరీక్షల్లోనూ భారత యువకుడికి కరోనా పాజిటివ్ అని రావడంతో అతన్ని పరీక్షించేందుకు జాతీయ అంటువ్యాధుల నివారణ కేంద్రానికి తరలించారు.


కొవిడ్ టీకాలు వేయించుకున్న వ్యక్తులు కూడా కరోనా బారినపడే అవకాశాలున్నాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ తన నివేదికలో పేర్కొంది. టీకాలు వేయడం ద్వారా కరోనా సంక్రమణ వ్యాప్తి చెందకుండా నిరోధించడంపై మరిన్ని పరిశోధనలు అవసరమని ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.సింగపూర్ లో ఇప్పటివరకు 60.653 కొవిడ్ కేసులు నమోదైనాయి.సింగపూర్ లో కరోనాతో 30మంది మరణించారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM