టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణ, సీఐఎస్ఎఫ్ కాల్పులు.

by సూర్య | Sat, Apr 10, 2021, 03:51 PM

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు మధ్య వార్ జరుగుతోంది. 2021, ఏప్రిల్ 10వ తేదీ శనివారం నాలుగో దశల ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి కొనసాగుతున్న పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుండగా..ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుచ్‌బెహార్‌లో టీఎంసీ – బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో రెచ్చిపోయిన కొంతమంది అక్కడున్న ఓ సీఐఎస్‌ఎఫ్‌ పోలీసుపై దాడికి ప్రయత్నించారు.


దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. కాల్పుల సమయంలో సంఘటనా స్థలంలో సుమారు 600 మంది నిరసనకారులు ఉన్నారు. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారంతా తమ పార్టీ కార్యకర్తలే అని టీఎంసీ ఆరోపిస్తోంది. కావాలనే బీజేపీ హత్య చేయించిందంటున్నారు. దీని వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని టీఎంసీ ఆరోపిస్తోంది.


టీఎంసీ పార్టీకి చెందిన నేతలు ఈసీకి ఫిర్యాదు చేసింది. తమ పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొందని, బీజేపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదులో వెల్లడించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని అక్కడున్న పోలీంగ్ అధికారులను ఆదేశించింది ఈసీ.ఇదిలా ఉంటే…హుగ్లీలో టీఎంసీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ కారుపై టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. లాకెట్ ఛటర్జీ కారు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసు భద్రత నడుమ లాకెట్ ఛటర్జీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM