భారత్ ప్ర‌యాణికుల‌పై న్యూజిలాండ్ నిషేధం

by సూర్య | Thu, Apr 08, 2021, 09:32 AM

దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు గ‌ణ‌నీయంగా పెరిగిపోతున్న క్ర‌మంలో ఇత‌ర దేశాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. భార‌త్ నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై నిషేధం విధించాల‌ని న్యూజిలాండ్ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు న్యూజిలాండ్ ప్ర‌ధాన‌మంత్రి జెసిండా ఆర్డెర్న్ అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. భార‌త ప్ర‌యాణికుల‌తో పాటు న్యూజిలాండ్ పౌరుల‌పై తాత్కాలికంగా నిషేధం విధించిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నిబంధ‌న ఏప్రిల్ 11వ తేదీ నుంచి 28వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు.భార‌త్‌లో నిన్న ఒక్క‌రోజే ల‌క్షా 25 వేలకు చేరువ‌లో పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మ‌హారాష్ర్ట‌లో అత్య‌ధికంగా 60 వేల పాజిటివ్ కేసులు, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 10 వేలు, క‌ర్ణాట‌క‌, యూపీలో 6 వేల చొప్పున పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. అదే స్థాయిలో క‌రోనా టీకా కొర‌త కూడా ఏర్ప‌డింద‌ని ఆయా రాష్‌ర్టాలు చెబుతున్నాయి.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM