పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న యూట్యూబ్ చానళ్లు

by సూర్య | Wed, Apr 07, 2021, 03:12 PM

సాంకేతిక పరిజ్ఞానం పెరిగినకొద్ది కొన్ని మంచి జరుగుతున్న చెడు కూడా అంతకు రెండింతలు జరుగుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో సమాజానికి సోషల్ మీడియా లాభం చేకూర్చె విధంగా ఉండగా మరెన్నో విషయాల్లో సోషల్ మీడియా వల్ల తప్పులు జరుగుతున్నాయన్నది నిజం.


ఇకా సోషల్ మీడియాలో భావప్రకటన స్వేచ్చ పేరుతో యూట్యూబ్ చానళ్ల వల్ల కొంతమందికి లాభం చేకూరితె అధిక సంఖ్యలో నష్టం వాటిల్లుతుంది అనటంలో సందేహాం లేదు. ఒక మండల స్థాయి రిపోర్టర్ గా విధులు నిర్వర్తించాలంటే సమాజం పట్ల అవగాహన, విద్యార్వత, తెలిసి ఉండాలి, అలా ఒక మండల స్థాయి రిపోర్టర్ గా చేరిన సదురు విలేఖరి ఫీల్డ్ లో ఎన్నో అనుభవాలను నేర్చుకుంటాడు, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోంటాడు, యాజమాన్యానికి అనుకూలంగా ఉండి తాను ఒక రిపోర్టర్ గా స్తిరపడెండుకు ఎన్నో త్యాగం చేస్తాడు.


ఆ కష్టం వెనుక వచ్చె ప్రతిఫలం పదిమందిలో మంచి గుర్తింపు, ఆ గుర్తింపు కోసం ఎంతో తహాతహాలాడుతాడు ఇవన్నీ చేస్తేగాని ఒక విలేఖరి తాను పదిమందికి తెలియని పరిస్థితి దానికి సంవత్సరాల సమయం పడుతుంది. ఒక గ్రామ స్థాయి విలేఖరి చెయ్యాలంటె ఎన్నో ఆంక్షలతో యాజమాన్యాలు తమ చానల్, పత్రికల్లో చేర్చుకుంటాయి, అలాంటి పరిస్థితుల్లో సగటు విలేఖరి నానా కష్టాలకోర్చుకోని అడ్వర్టైజింగ్మెంట్ సర్కిలేషన్ అంటు టార్గెట్లను చెయ్యడానికె సరిపోతాడు. వీటితో పాటు వాళ్ల పరిధి వార్తలు రోజువారిగా ఉంటునే ఉంటాయి, ఇవన్నీ చేస్తెగానీ ఒక మండల, టౌన్, నియోజకవర్గ, జిల్లా, ఉమ్మడి జిల్లా, రిపోర్టర్ గా నిలదొక్కుకోలేడు.


అలాంటి జర్నలిజాన్ని తమ "ఇజంగా" మార్చుకొని, కొందరు ఎలాంటి అవగాహన లేకుండా, వ్యవస్థ పట్ల కనీస అవగాహన లేకుండా న్యూస్ చానల్ పేరుతో "యూట్యూబ్" చానల్ క్రియెట్ చెయ్యడం, సదురు లోగో మైకు పట్టుకొని ఇంటర్వ్యూ లు అని, వార్తలను తీయడం, తమ చానల్ లో విలేఖరుగా అవకాశం ఉందని వివిధ ప్రాంతాల నుండి విలేఖర్లను నియమించటం ఇది ప్రస్తుతం జరుగుతున్న మీడియా ముసుగులో జరుగుతున్న లే "టేస్టు" పంథా.


ఈ యూట్యూబ్ చానల్ ద్వారా తమ క్రియోటివితో సమాజానికి మంచి జరిగె విషయాలను చెప్పితె ఫర్వలేదు, కానీ ఇతర పంథలాను ఎంచుకొని కొందరు తమ చానల్ నడిపిస్తున్నారు.


సాధారణంగా ఈ సాంకేతికత పెరిగాకా లైవ్ ...ప్రత్యేక్షప్రసారం అనేది చాలా సులువుగా మారిపోయింది. దీంతో యూట్యూబ్ తమ చానల్ కు లైవ్ టెలీకాస్ట్ చేసుకోవటానికి అవకాశం ఇచ్చింది. దీంతోపాటు భూతులు,అసభ్యపదజాలంతో బాషను ఉపయోగించిన ఆ పదాలు ఎలా పెడుతె అలా రావటంతో కొందరు వాటిని ఆసరాగా చేసుకొని భయాబ్రాంతులకు గురి చేస్తున్నారు.


యూట్యూబ్ చానల్ కు ఫర్మిషన్ అంటు ఏం ఉండదు ఉంటుందని ఎవరైన చెపితె అది సుద్ద డబ్బులు గుంజటానికి చెపుతున్న మాటలు మాత్రమె.


తమ చానల్ లోగో ను ట్రెడ్ మార్క్,తమ చానల్ పేరును పోస్టల్ రిజిస్టేషన్, ఫర్మ్ రిజిష్టేషన్ చేసుకునే టివి కేవలం కేబుల్ నెట్వర్క్ చానల్ మాత్రమె చేయించుకుంటాయి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం అలా ఈ ఫర్మిషన్ తీసుకున్నాక గూగుల్ స్టోర్ లో ఓ ఆప్ కొనుగోలు చేసి ఆ ఆప్ ద్వారా ప్రసారం చేస్తు ఆ ఆప్ లింకు ద్వారా సదురు కేబుల్ నెట్వర్క్ లో తమ చానల్ సెట్ అఫ్ బాక్స్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యంతో ఆ కేబుల్ నెట్వర్క్ లో ఉన్న టీవి కనెక్షన్ లకు ఆ చానల్ వచ్చెటట్టు చెయ్యడం ఓ ప్రక్రియ, ఈ ప్రక్రియ లో చానల్ వస్తుంది కానీ అది శాటిలైట్ చానల్ కాదని గ్రహించాలి.


ఇలా యూట్యూబ్ చానల్ ద్వారా కాఫిరైట్స్ లేని కొన్ని ఇంట్రోలు, టిక్కర్ లతో నిజంగా చానల్ వస్తున్నట్టు బ్రేకింగ్ న్యూస్, న్యూస్ అప్డెట్ అంటు తమ‌ చానళ్లలో ఇష్టానుసారంగా చానళ్లను మలుచుకుంటున్నారు.


ఏదైనా ప్రాంతానికి ప్రజా ప్రతినిధులు, లేదా ఏదైనా మీడియా సమావేశం నిర్వహించినప్పుడు గతంలో లో ప్రింట్ మీడియా రిపోర్టర్లు ఓ నలుగురు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు ఆ నలుగురు ఉండేవారు కానీ యూట్యూబ్ ఛానల్ రాకతో ఏదైనా కార్యక్రమం నిర్వహించినప్పుడు చిన్న మండల కేంద్రంలో కూడా ఇరవై నుండి ముప్పై లోగోలు దర్శనమిస్తున్నాయి. ఇందులో శాటీ లైట్, కేబుల్, యూట్యూబ్ చానళ్లు ఏమో తెలియక తికమక పడుతున్నారు. దీనివల్ల నిజమైన జర్నలిస్టులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎవరికీ చెప్పుకోలేక జర్నలిజం పట్ల అవగాహన లేని వాళ్ళతో వాదించ లేక సదరు జర్నలిస్టు మిన్నుకుంటున్నాడు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM