కరోనా టెన్షన్.. 630 మంది కన్నుమూత

by సూర్య | Wed, Apr 07, 2021, 02:12 PM

ఇండియాలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడచిన 48 గంటల వ్యవధిలో యాక్టివ్ కేసుల సంఖ్య 7 లక్షల నుంచి 8 లక్షలకు పెరగడమే ఇందుకు నిదర్శనం. కరోనా మహమ్మారి ఇండియాలోకి ప్రవేశించిన తరువాత రెండు రోజుల వ్యవధిలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు పైగా పెరగడం ఇదే తొలిసారి. గత సంవత్సరంలో రోజువారీ కేసుల సంఖ్య లక్షకు చేరువైన వేళ, మూడు రోజుల వ్యవధిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య లక్ష పెరిగింది. ఇప్పుడు రెండో వేవ్ ఉద్ధృతంగా సాగుతున్నందున మంగళవారం నాడు ఏకంగా 1,15,249 కొత్త కేసులు వచ్చాయి. ఇదే సమయంలో 630 మంది ప్రాణాలను కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య మంగళవారం నాడు 54 వేలకు పైగా పెరిగి, అత్యధిక ఒక రోజు రికార్డును నమోదు చేయగా, ఒక్క మహారాష్ట్రలోనే 55,469 కొత్త కేసులు వచ్చాయి. ఆదివారం నాడు రికార్డు స్థాయిలో 1,03,844 కొత్త కేసులు రాగా, రెండు రోజుల తరువాత ఆ రికార్డును దాటుతూ మరిన్ని కేసులు రావడంతో కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.

Latest News

 
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM
ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు Sun, Apr 28, 2024, 10:19 AM
వైసీపీ మేనిఫేస్టో తుస్సుమంది: గంటా Sun, Apr 28, 2024, 10:14 AM
ఇలా చేస్తే మహిళల ఖాతాలో రూ.లక్ష Sun, Apr 28, 2024, 09:56 AM
రానున్న 5 రోజులు ముప్పు.. జాగ్రత్త: IMD Sun, Apr 28, 2024, 09:54 AM