దేశంలో కొత్తగా 96,982 కొవిడ్‌ కేసులు

by సూర్య | Tue, Apr 06, 2021, 11:03 AM

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,982 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,26,86,049కు పెరిగింది. మహమ్మారి ప్రభావంతో మరో 446 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 50,143 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 7,88,223కు చేరాయి. ఇప్పటి వరకు 1,17,32,279 మంది కోలుకోగా.. మొత్తం 1,65,547 మంది ప్రాణాలు కోల్పోయారు.టీకా డ్రైవ్‌లో భాగంగా 8,31,10,926 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. నిన్న ఒకే రోజు 12.11 లక్షలకుపైగా కొవిడ్‌ నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. మహమ్మారి ప్రారంభం నుంచి నిన్నటి వరకు 25.02 కోట్ల నమూనాలను పరిశీలించినట్లు వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 47,288 నమోదయ్యాయి. కొత్త కేసుల్లో దాదాపు 49 శాతం వరకు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 7,302, కర్ణాటకలో 5,279 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Latest News

 
షాపులో యువకుడు ఆత్మహత్య Fri, May 10, 2024, 04:03 PM
ఇరుక్కుపోయిన లారీ అవస్థలు పడుతున్న గ్రామస్తులు Fri, May 10, 2024, 04:01 PM
తెలుగుదేశం పార్టీలో చేరిన 20 మంది వైసీపీ నాయకులు Fri, May 10, 2024, 03:59 PM
పొగాకు అత్యధిక ధర కేజీ రూ. 299 Fri, May 10, 2024, 03:57 PM
ఓటు హక్కు వినియోగించుకోవాలని బైక్ ర్యాలీ Fri, May 10, 2024, 03:55 PM