మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

by సూర్య | Mon, Apr 05, 2021, 08:57 AM

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో పాటు వారాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నారు. లాక్‌డౌన్‌ను వచ్చే వారాంతంలో అమలు చేయనున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. 50 శాతం సిబ్బందితోనే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని ప్రభుత్వం తెలిపింది. కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో హోటళ్లు, మాల్స్‌, బార్లు మూతపడనున్నాయి. హోం డెలివరీ, అత్యవసర సేవలను అనుమతించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


 


 

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM