స్వల్పంగా పెరిగిన బంగారం

by సూర్య | Mon, Apr 05, 2021, 08:29 AM

దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు హెచ్చు, తగ్గులతో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇక గతకొన్ని రోజులగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒకానొక సమయంలో రూ. 55 వేలకు చేరుకున్న తులం బంగారం ధర ఇప్పుడు మళ్లీ రూ.47 వేలకు దిగువకు చేరుకుంది. ఇక తాజాగా సోమవారం బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం..


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..


* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 10 పెరిగి.. 44,410గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 48,450 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 65,010గా ఉంది.


 


* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర 43,910 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,910 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,010 గా ఉంది.


 


* కర్నాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,260 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,100 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 65,910 గా ఉంది.


 


* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,780 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,670 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,710గా ఉంది.

Latest News

 
టిడిపి అరాచకం మాదిగలపై దాడి Mon, May 06, 2024, 03:59 PM
అల్లి నగరంలో ఎన్నికల ప్రచారం Mon, May 06, 2024, 03:55 PM
పోస్టల్ బ్యాలెట్స్ కి అపూర్వ స్పందన Mon, May 06, 2024, 03:53 PM
పేదల సంక్షేమమే వైసీపీ ధ్యేయం: నాగార్జున Mon, May 06, 2024, 03:51 PM
భైరవకోనలో ప్రత్యేక పూజలు Mon, May 06, 2024, 03:49 PM