రైల్వేల ప్రైవేటీకరణపై స్పష్టత ఇచ్చిన పీయూష్ గోయల్

by సూర్య | Wed, Mar 31, 2021, 12:18 PM

భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించాలనే ఆలోచన లేదని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారతీయ రైల్వేలు ప్రభుత్వ ఆస్తి అని, అలాగే కొనసాగుతాయని చెప్పారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. పశ్చిమ బెంగాల్‌లో ఓ బహిరంగ సభలో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘‘భారతీయ రైల్వేలు జాతి సంపద, ప్రజల సంపద. వీటిని ఎవరూ తాకలేరు. రైల్వేల ప్రైవేటీకరణ ఎన్నటికీ జరగదు. ప్రతిపక్షాల ప్రచార వలలో చిక్కుకోవద్దు. ఇది మీ ఆస్తి. అలాగే కొనసాగుతుంది’’ అని పీయూష్ గోయల్ ఖరగ్‌పూర్ బహిరంగ సభలో చెప్పారు. దేశవ్యాప్తంగా రైల్వే సేవలను మెరుగుపరిచేందుకు ప్రైవేటు పెట్టుబడులను స్వాగతించాలని చెప్పారు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM