మే నాటికి గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి

by సూర్య | Wed, Mar 31, 2021, 12:35 PM

మే నాటికి గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి కావాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ఏప్రిల్‌, మే నెలలో అమలు చేయనున్న పథకాలపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రికార్డు స్థాయిలో ఉపాధి హామీ పనులు చేపట్టినందుకు ఈ సందర్భంగా అధికారులను అభినందించారు. కొవిడ్‌ వంటి మహమ్మారిని ఎదుర్కోవడానికే విలేజ్‌ క్లినిక్‌లు తీసుకొస్తున్నట్లు సీఎం చెప్పారు. యుద్ధప్రాతిపదికన వాటి నిర్మాణం పూర్తి చేసి ఆగస్టు 15న ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


రాష్ట్రవ్యాప్తంగా 9, 899 చోట్ల బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ (బీఎంసీ) సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. సెప్టెంబర్‌ నెలలో బీఎంసీలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అలాగే 25 ప్రాసెసింగ్‌ యూనిట్ల కోసం భూములను గుర్తించాలని. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక యూనిట్‌ చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అర్హులకు 90 రోజుల్లోగా ఇంటి పట్టా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM