ఇకపై రైళ్లలో రాత్రివేళ నో ఫోన్ ఛార్జింగ్...

by సూర్య | Wed, Mar 31, 2021, 11:24 AM

భారతీయ రైల్వే తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించనుంది. ఇకపై రాత్రివేళ ప్రయాణికులు రైల్లోని ఛార్జింగ్ పాయింట్లను వినియోగించి తమ మొబైల్ ఫోన్ లేదా ల్యాప్ టాప్‌లను ఛార్జింగ్ చేసుకోలేరు. ఇటీవలి కాలంలో రైళ్లలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపధ్యంలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే సీనియర్ అధికారి ఈ విషయమై మాట్లాడుతూ రాత్రివేళ రైళ్లలో ఫోన్లు, ల్యాప్ టాప్‌లు ఛార్జింగ్ చేసుకునే అవకాశాన్ని ఎత్తివేయడమనేది రైల్వేశాఖ తీసుకున్న అతిపెద్ద నిర్ణయమన్నారు. ఇకపై రైళ్లలోని ఛార్జింగ్ పాయింట్లను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ బంద్ చేయనున్నారు. డెహ్రాడూన్ వెళ్లే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. ఇదేవిధంగా రాంచీలోను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదాల దరిమిలా రైల్వేశాఖ షార్ట్ సర్క్యూట్‌లను నివారించేందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుంది.

Latest News

 
మరో తొమ్మిది ప్రశ్నలు.. సీఎం జగన్‌కు షర్మిల రెండో లేఖ Sat, May 04, 2024, 08:44 PM
ఈ అద్దంలో మీకు ఏం కనిపిస్తోంది..? సీఎం జగన్‌కు సోదరి షర్మిల గిఫ్ట్ Sat, May 04, 2024, 08:39 PM
షర్మిలను మిస్ అవుతున్నా.. పార్టీలోకి చేరుంటే.. జగన్ ఎమోషనల్ Sat, May 04, 2024, 08:32 PM
ప్రకాశం జిల్లా తీర్పు విభిన్నం.. 12 నియోజకవర్గాల బరిలో ఎవరెవరు Sat, May 04, 2024, 07:47 PM
గుంటూరు జిల్లాలో గెలిచే పార్టీదే అధికారం.. 17 నియోజకవర్గాల బరిలో ఎవరెవరు? Sat, May 04, 2024, 07:42 PM