ఐపీఎల్ ‌లో కొత్త రూల్స్‌..

by సూర్య | Tue, Mar 30, 2021, 03:49 PM

మ‌రికొన్ని రోజుల్లో ఐపీఎల్ 14వ సీజ‌న్ ప్రారంభం కానుంది. ఈ ఐపీఎల్ లో కొన్ని కొత్త రూల్స్ ఉండనున్నాయి. సాఫ్ట్ సిగ్న‌ల్‌, ఇన్నింగ్స్ ముగియాల్సిన స‌మ‌యంపై బీసీసీఐ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఐపీఎల్ ‌లో ఆన్ ‌ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్న‌ల్ ఉండ‌ద‌ని బోర్డు తెలిపింది.


-> ఇక ఈ సీజ‌న్‌ లో 90 నిమిషాల్లోనే ఇన్నింగ్స్‌ 20వ ఓవ‌ర్ పూర్తి కావాలి. గ‌తంలో 90వ నిమిషం లేదా ఆలోపు 20వ ఓవ‌ర్ ప్రారంభించే వీలు ఉండేది. కానీ మ్యాచ్ సమయాన్ని తగ్గించేందుకు బోర్డు ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఒక ఇన్నింగ్స్ క‌చ్చితంగా 90 నిమిషాల్లోనే (85 నిమిషాల ఆట + 5 నిమిషాల స్ట్రేట‌జిక్ టైమౌట్‌) ముగియాలి. అంటే గంట‌కు 14.11 ఓవ‌ర్లు వేయాలి.


-> ఓ బ్యాట్స్‌మ‌న్ ప‌రుగు తీసే క్ర‌మంలో బ్యాట్ ‌ను క్రీజులో స‌రిగా ఉంచ‌క‌పోతే షార్ట్ ర‌న్ ‌గా అంపైర్లు ప్ర‌క‌టిస్తారు. అయితే ఈ ఏడాది నుంచి ఈ నిర్ణ‌యాన్ని థ‌ర్డ్ అంపైర్‌ కు వ‌దిలేశారు. ఒక‌వేళ ఆన్‌ ఫీల్డ్ అంపైర్ పొర‌పాటున షార్ట్ ర‌న్ ప్ర‌కటిస్తే దానిని ఓవ‌ర్ రూల్ చేసే అవ‌కాశం థ‌ర్డ్ అంపైర్ ‌కు ఉంటుంది.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM