పెద్ద ఎత్తున సంక్షోభం వస్తే కొంత నష్టం తప్పదు: మంత్రి సురేష్

by సూర్య | Sat, Mar 27, 2021, 02:12 PM

 కోవిడ్ స్థితిగతులపై మంత్రి ఆదిమూలపు సురేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రణాళికతో చర్యలు తీసుకోవడంతో అకడమిక్ క్యాలెండర్‌ను గాడిలో పెట్టామన్నారు. కోవిడ్ కేసులు వచ్చిన విద్యాసంస్థలను వెంటనే మూసేయాలని సూచించారు. పెద్ద ఎత్తున సంక్షోభం వస్తే కొంత నష్టం తప్పక ఉంటుందని సురేష్ పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు మన రాష్ట్రంలోనే నమోదయ్యాయన్నారు. కోవిడ్ మళ్లీ పుంజుకుంటోందని.. రెండు నెలలు జాగ్రత్త అవసరమన్నారు. రాజమండ్రిలోని ప్రైవేట్ కళాశాలలో 168 మందికి కరోనా సోకిందన్నారు. కరోనా సోకిన వారిని ప్రాథమికంగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు ఇంకా పెంచుతామని మంత్రి సురేష్ వెల్లడించారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM