అధిక వేడిని తగ్గించుకోండిలా..

by సూర్య | Thu, Mar 25, 2021, 05:08 PM

మనం తీసుకునే ఆహారం, ఇతర అలవాట్లతో కూడా శరీరంలో అధిక వేడిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే వేడిని తగ్గించేందుకు కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం వల్ల సమస్యను అధిగమించవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆ చిట్కాలేంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం.


కూర్చునే చోట తగినంత ఆక్సిజన్ ఉండేటట్లు చేసుకోవాలి. ఫ్యాన్, కూలర్ల వద్ద కొన్ని నిమిషాలు కూర్చుని సేదతీరాలి. ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే కొద్దిసేపు కూర్చున్న తర్వాత లేచి అటూ ఇటూ తిరుగుతుండాలి. మణికట్టు, ఛాతీ లాంటి బాగాల్లో చల్లని నీళ్లను, లేక ఐస్ ‌ను రాస్తే కొంచెం ఉపశమనం లభిస్తుంది. థైరాయిడ్ ఎక్కువ యాక్టివ్‌ గా ఉంటే శరీరంలో అధిక వేడి ఉత్పన్నమవుతుంది. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం సైతం పెరుగుతుంది. అలాంటి వారు డాక్టర్ ‌ను సంప్రదించి సలహాలు పాటించాలి. తరచుగా నీళ్లు, జ్యూస్ లాంటివి తాగాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది. ఒక స్పూన్ మెంతుల్ని తినడంగానీ, లేకపోతే వాటిని పొడిగా చేసి నీళ్లలో కలుపుకుని తాగినా అధిక వేడి నుంచి మీకు ఉపశనమనం లభిస్తుంది. ఈత కొట్టడం వల్ల, స్నానం చేయడం వల్ల కూడా ఉష్ణోగ్రత కొద్దిమేర తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM