బాలిక వీడియో తీసి బ్లాక్ మెయిల్!

by సూర్య | Thu, Mar 25, 2021, 04:07 PM

సమాజంలో నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా యూపీలోని ఘజియాబాద్ లో ఓ ఘోరం వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక ఇంటి పక్కనే ఆటోమొబైల్‌ రిపేర్‌ షాప్‌ నిర్వహించే సమీర్‌ అనే వ్యక్తి గత కొంత కాలంగా బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో మార్చి 11న ఆమెను తన షాపుకు పిలిపించుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు.


ఈ దారుణాన్ని అక్కడే ఉన్న నిందితుడి బంధువు కెమెరాలో రికార్డు చేశాడు. అనంతరం నిందితుడి బంధువు ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత వీడియోను డిలీట్ చేస్తామని ఈ నెల 21న మరో సారి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక విషయం ఇంట్లో చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిని జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించారు.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM