హోలీ వేడుకలపై కరోనా ఎఫెక్ట్?

by సూర్య | Wed, Mar 24, 2021, 02:22 PM

దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. కొన్ని చోట్ల లాక్ డౌన్, మరికొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు భౌతిక దూరం పాటించాలని, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో అతిపెద్ద పండుగల్లో ఒకటైన హోలీ.. ఈ నెల 29వ తేదీన రాబోతోంది. ఈ పండుగ వేడుకలపై కరోనా ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీలో హోలీ వేడుకలను నిషేధించారు. నవరాత్రి వేడుకలపై ఆంక్షలు విధించారు. మహారాష్ట్రతో పాటుగా ఢిల్లీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేసుల సంఖ్య పెరిగితే హోలీ వేడుకలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM