మరోసారి తెరపైకి ఫిక్సింగ్ వివాదం

by సూర్య | Tue, Mar 23, 2021, 03:55 PM

ప్రముఖ క్రికెటర్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన ‌పై మరోసారి సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కేసు దర్యాప్తును సీబీఐ పునర్విచారణ చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసిషన్ అధ్యక్షుడు యెండల లక్ష్మినారాయణ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలుస్తామన్నారు . క్లీన్‌ చిట్‌ లేని వ్యక్తి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఎ)ను భ్రష్టు పట్టిస్తున్నారని మండి పడ్డారు. ఆడిట్‌ లేని కారణంగా ఐపీఎల్‌ను నిర్వహించేందుకు నిరాకరించా రన్నారు. ముస్తాక్‌ అలీ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీ సెలక్షన్‌లో అనేక అవకతవకలు జరిగాయన్నారు. రంజీ క్రికెట్‌ ఎంపికలోనూ అనేక అక్రమాలు జరుగుతున్నా యన్నారు. అజరుద్దీన్‌ కేవలం ఎన్నికల్లో పోటీ చేసేందుకు కోర్టు నుంచి తాత్కాలిక అనుమతి మాత్రమే తెచ్చుకున్నారని అన్నారు. తనపై ఉన్న మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అభియోగాల నుంచి అజర్‌ తప్పించుకోలేరన్నారు. అజారుద్దీన్ కేవలం ఎన్నికల్లో పోటీ చేయడానికి కోర్టు నుంచి తాత్కాలిక అనుమతి మాత్రమే తీసుకున్నారని యెండల అన్నారు. తనపై ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ అభియోగాలు నుంచి అజర్ తప్పించు కోలేరన్నారు.

Latest News

 
మూడు నెలల్లో రెండు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ సొంత జిల్లాలోనే! Mon, Apr 29, 2024, 08:06 PM
టీడీపీకి భారీ ఊరట.. ఆ నియోజకవర్గాల్లో నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న రెబల్ అభ్యర్థులు Mon, Apr 29, 2024, 08:02 PM
ఎన్నికల వేళ ఏపీవాసులకు రైల్వే గుడ్ న్యూస్.. ఇక నో టెన్షన్ Mon, Apr 29, 2024, 07:57 PM
ఓవైపు కూతురు.. మరోవైపు కొడుకు పోటీ.. మధ్యలో వైసీపీ లీడర్ Mon, Apr 29, 2024, 07:44 PM
వైసీపీలోకి పిఠాపురం వర్మ?.. క్లారిటీ వచ్చేసిందిగా Mon, Apr 29, 2024, 07:39 PM