ఖోర్‌ సెక్టార్‌లో ముగ్గురు ముష్కరుల హతం

by సూర్య | Wed, Jan 20, 2021, 01:37 PM

శ్రీనగర్‌ : జమ్మూ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఈ ఘటనలో నలుగురు సైనికులు సైతం గాయపడ్డారు. చొరబాటు ప్రయత్నాలను సైన్యం విఫలం చేసిందని రక్షణ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులను దేశంలోకి పంపేందుకు పాక్‌ సైన్యం ఎల్‌ఓసీలోని అఖ్నూర్‌ సెక్టార్‌లోని ఖోర్‌ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం నుంచి భారీ కాల్పులను ప్రారంభించిందని పేర్కొన్నాయి. పాక్‌ షెల్‌ దాడిలో నలుగురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారని.. ఇదే సమయంలో భారత సైన్యం చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని తెలిపాయి. అలాగే చొరబాటుకు యత్నించిన ప్రయత్నాలను అడ్డుకున్నట్లు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. హతమైన ఉగ్రవాదుల మృతదేహాలు నియంత్రణ రేఖ వద్ద పాక్‌ వైపు పడి ఉన్నాయని, వాటిని పాక్‌ దళాలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. 2021లో ఎల్‌ఓసీ వెంట మొదటిసారిగా జరిగిన అతిపెద్ద కాల్పుల విరమణ ఉల్లంఘన ఇదేనని అధికారులు చెప్పారు. కాశ్మీర్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు భంగం కలిగించేలా పాక్‌లోని లాంచింగ్‌ ప్యాడ్ల వద్ద పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. వారికి పాక్‌ ఆర్మీ, రేంజర్లు సహకరిస్తున్నట్లు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM