గబ్బా టెస్ట్ లో పోరాడుతున్న టీమిండియా...సెంచరీ మిస్సైన గిల్

by సూర్య | Tue, Jan 19, 2021, 10:35 AM

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ఆఖరి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఆసీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు టీమిండియా బ్యాట్స్ మెన్. 328 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్‌ ముందు ఉంచి సవాల్‌ విసిరిన ఆసీస్‌కు అదే రీతిలో భారత బ్యాట్స్‌మెన్స్‌ సమాధానం చెబుతున్నారు.బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ఆఖరి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఆసీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు టీమిండియా బ్యాట్స్ మెన్. 328 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్‌ ముందు ఉంచి సవాల్‌ విసిరిన ఆసీస్‌కు అదే రీతిలో భారత బ్యాట్స్‌మెన్స్‌ సమాధానం చెబుతున్నారు. నాలుగు పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరిరోజు ఆటను ప్రారంభించి టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురెబ్బ తగలింది. ఓపెనర్‌‌ రోహిత్‌ శర్మ 7 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత మరో ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌తో జతకట్టిన చతేశ్వర పుజారా ఇన్నింగ్స్‌‌ను ముందుండి నడిపించాడు. యువ బ్యాట్స్‌మెన్‌‌ గిల్‌ అద్భుతమైన ఆటతీరుతో హాఫ్‌ సెంచరీ సాధించి.. 91 పరుగుల వద్ద వెనుదిరిగాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా, రహానే ఉన్నారు. నాలుగో రోజు ఆటకు వర్షం పలుమార్లు అడ్డుపడటంతో దాదాపు రెండు గంటల ఆట తుడిచిపెట్టుకుపోయింది.



ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా భారత్‌కు కలిగే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే సిరీస్‌ 1-1తో సమంగా ఉంది. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా.. చివరగా బోర్డర్‌-గవాస్కర్ (2018-19) సిరీస్‌లో విజేతగా నిలిచిన భారత్‌ దగ్గరే ఆ ట్రోఫీ ఉంటుంది. కానీ ఈ మ్యాచ్‌ నెగ్గకపోతే మాత్రం ఆసీస్‌ పరువు కచ్చితంగా పోతుంది. ఎందుకంటే గత 31 టెస్టుల్లో తమకు పరాజయం తెలీని గబ్బా మైదానంలో.. అత్యుత్తమ ఎలెవన్‌ అందుబాటులో లేని భారత్‌తో తలపడుతోన్న ఆ జట్టు డ్రా చేసుకున్నా అది ఓటమితో సమానమే.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM