ఢిల్లీ స్టూడెంట్లకు పూలతో స్వాగతం

by సూర్య | Tue, Jan 19, 2021, 09:05 AM

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ కారణంగా మూతపడిన స్కూల్స్‌ పదినెలల తరువాత తెరుచుకున్నయ్. కంటెయిన్‌మెంట్‌ జోన్లకు బయట ఉన్న స్కూళ్లన్నీ ఓపెన్‌ చేసుకోవచ్చని ఢిల్లీ సర్కారు ప్రకటించింది. స్టూడెంట్స్‌కు ఫిజికల్‌ అటెండెన్స్‌ కంపల్సరీ కాదని, పేరెంట్స్‌ అనుమతితోనే స్కూల్‌కు రావాలని స్పష్టంచేసింది. క్లాస్‌ 10, 12 చదివే స్టూడెంట్స్‌కు మే 4 నుంచి బోర్డు ఎగ్జామ్స్‌ కండక్ట్‌ చేస్తామని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ప్రకటించింది. ఈ క్రమంలో స్కూళ్లలో ఫిజికల్‌ క్లాసులు స్టార్ట్‌ చేశారు. కొన్ని స్కూల్స్‌లో బెలూన్లు, పువ్వులు, శానిటైజర్లతో స్టూడెంట్స్‌కు టీచర్లు వెల్‌కమ్‌ చెప్పారు. స్కూల్‌లో స్టూడెంట్స్‌ను చూడడం ఆనందంగా ఉందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్ చేశారు. చిరాగ్‌ ఎన్‌క్లేవ్‌లోని స్కూల్​ను డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా సందర్శించారు. రాజస్థాన్​లో 50% సీటింగ్‌ కెపాసిటీతో స్కూల్స్‌ రీఓపెన్ చేసుకోవచ్చని అక్కడి సర్కారు పర్మిషన్ ఇచ్చింది. దీంతో క్లాస్‌ 9 నుంచి 12 స్టూడెంట్ల కోసం సోమవారం స్కూళ్లను రీఓపెన్‌ చేశారు. రీఓపెన్ సందర్భంగా ఆదివారం అన్ని స్కూళ్లలో శానిటైజేషన్ చేశారు.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM