కోరికలు తీర్చాలంటూ బ్లాక్‌మెయిల్..!

by సూర్య | Mon, Jan 18, 2021, 01:39 PM

మహారాష్ట్ర, పుణె, ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతుంటే బిజినెస్‌లు జోరందుకుంటున్న సమయం. ఓ మార్కెట్ యార్డులో క్లాస్‌గా ఉంది ఆ ఆయుర్వేద మసాజ్ పార్లర్. తోటి వారి లాగే ఆ మహిళా జాబ్ చేస్తోంది. వచ్చిన కస్టమర్లకు మసాజ్ చేయడం ఆమె డ్యూటీ. అక్కడకు వచ్చిన ఓ కస్టమర్. కాసేపు ఆమెవైపు అదోలా చూశాడు. వెంటనే తన మొబైల్ బయటకు తీశాడు. అందులో ఓ ప్రత్యేక యాప్ ఉంది. దాన్ని తెరిచాడు. మొబైల్ కెమెరాను ఆన్ చేశాడు. ఆ యాప్ కారణంగా కెమెరా ఆన్‌లో ఉన్నా, వీడియో రికార్డ్ అవుతున్నా ఆ విషయం బయటకు తెలియదు. జనరల్‌గా డిటెక్టివ్‌లు తమ పరిశోధన కోసం అలాంటి యాప్స్ వాడుతుంటారు. ఇక్కడ ఆ కస్టమర్ మొబైల్ కెమెరా వీడియో ఆన్ చేశాడు. రికార్డు చేయసాగాడు. ఇవేవీ తెలియని ఆమె సార్ రండి అని పిలిచింది. ఇక్కడ పడుకోండి అంటే పడుకున్నాడు. ఓవైపు ఆమె మసాజ్ చేస్తుంటే మరోవైపు తన మొబైల్‌లో ఏవో న్యూస్ చూసుకుంటున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. కానీ అతను చేస్తున్నది వీడియో రికార్డ్. అది తెలియని ఆమె అటూ ఇటూ కదులుతూ మొత్తానికి మసాజ్ పూర్తి చేసింది. ఆమెను రకరకాల కోణాల్లో వీడియో తీశాడు. ఆ తర్వాత అంతా అయిపోయాక హాయిగా వెళ్లిపోయాడు. ఆమె తన పనిలో నిమగ్నమైపోయింది.
రెండ్రోజుల తర్వాత... ఆమెకు కొత్త మొబైల్ నంబర్‌తో కాల్ చేశాడు. "నిన్ను నగ్నంగా వీడియో తీశాను" అన్నాడు. ఆమె షాకైంది. నమ్మలేదు. వెంటనే ఆమె వాట్సాప్ నంబర్‌కు ఓ చిన్న వీడియో క్లిప్ పంపాడు. అందులో ఆమె మసాజ్ చేస్తున్నప్పుడు అటూ ఇటూ వంగిన దృశ్యాలున్నాయి. షాకైంది. తనకు తెలియకుండా... తనను అలా ఎలా వీడియో తీశాడని ఆశ్చర్యపోయింది. 5 నిమిషాల తర్వాత మళ్లీ కాల్ చేసి "నేను చెప్పినట్లు వినాలి. నేను చెప్పిన చోటికి రావాలి. నాతో గడపాలి. ఈ విషయం ఎవరికైనా చెప్పావో నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పెడతా" అని బెదిరించాడు. ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చలి జ్వరం వచ్చినట్లు ఓ మూల కూలబడింది. ఆ రోజు డ్యూటీ చేసిందే గానీ మనసంతా ఆందోళనే. తనకు బాగా క్లోజ్ అయిన ఓ తోటి ఉద్యోగినికి జరిగింది చెప్పింది. ఆమె చాలా మంచిది. "ఎవడాడు దొంగ అలాంటోళ్లని వదలొద్దు. నువ్వేం ఆలోచించకు. తిన్నగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి జరిగింది చెప్పు. నీకు పంపిన వీడియోని చూపించు. ఆళ్లు పట్టుకుంటారు. ఆడికుంటది" అని ధైర్యం చెప్పింది. దాంతో ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కేసు రాసిన పోలీసులకు పక్కా ఆధారాలు ఉండటంతో ఈజీగా సురేష్ అమ్హాదిక్‌ను పట్టుకున్నారు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM