13 ఏళ్ల బాలికపై 9 మంది లైంగిక దాడి

by సూర్య | Sun, Jan 17, 2021, 02:03 PM

 తొమ్మిది మంది మృగాలు.. 24 గంటలు.. మూడేసి సార్లు.. ఓ 13 ఏళ్ల అమ్మాయిని చిత్రవధ చేశారు. దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. వదిలిపెట్టాలంటూ బాలిక ఆ దుర్మార్గుల కాళ్లావేళ్లా పడినా కనికరం కూడా చూపలేదు. ట్రక్కు మార్చి ట్రక్కులోకి ఎక్కించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. రోడ్డు మీద వదిలేసి పరారయ్యారు. రోడ్డు మీద కనపడిన వాళ్లను సాయమడిగినా ఎవరూ స్పందించలేదు. సాయం చేసినట్టే చేసిన ఓ ట్రక్కు డ్రైవర్.. తానూ మృగాన్నేనని నిరూపించాడు. అతడూ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెను వదిలేసి పరారయ్యాడు. మొత్తంగా 9 మంది ఓ బాలిక జీవితంతో పైశాచిక ఆనందం పొందారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉమేరియాలో ఈనెల 11-12 తేదీల మధ్య జరిగింది. ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.


వివరాల ప్రకారం.. ఉమేరియాలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక.. ఈ నెల 11న షాపునకు వెళ్లింది. ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు ఒంటరిగా వెళుతున్న బాలికను కిడ్నాప్ చేశారు. అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. ట్రక్కులోనే బందీగా ఉంచి ఓ దాబాకు తీసుకెళ్లారు. అక్కడ మరో ఐదుగురు ఆ ఇద్దరితో కలిసి దారుణానికి పాల్పడ్డారు. దాబా యజమాని కూడా కనికరం చూపలేదు. తర్వాత ట్రక్కులోకి ఎక్కించి ఆ రోజు రాత్రంతా బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. తెల్లారి వేరే ట్రక్కులోకి ఎక్కించి తిప్పారు. వదిలిపెట్టాలని బాలిక ప్రాధేయపడినా వినిపించుకోలేదు. మళ్లీ లైంగిక దాడికి పాల్పడి.. రోడ్డు మీద వదిలేసి పరారయ్యారు. అక్కడితో ఆమె కష్టాలు తీరలేదు. సాయం చేయాలంటూ దారిన వచ్చిపోయే వారిని కోరింది. ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఓ ట్రక్కు డ్రైవర్ ఆమెను ట్రక్కులో ఎక్కించుకున్నాడు. అతడూ బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దారిలో వదిలేసి పారిపోయాడు.


రోడ్డు మీద పోలీసులు కనిపించడంతో వారి దగ్గరికి పరుగుపరుగున వెళ్లింది బాధిత బాలిక. వారు ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. దాదాపు 20 గంటల తర్వాత నోరు విప్పిన బాలిక జరిగిన విషయం వివరించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మానసికంగా చాలా కుంగిపోయిందని చెప్పారు.


 


 

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM