విగ్రహాల ధ్వంసంపై డీజీపీ చెప్పినవి వాస్తవం: అనిల్ కుమార్

by సూర్య | Sun, Jan 17, 2021, 01:38 PM

విగ్రహాలు పగులగొట్టినా పర్లేదు కానీ నిజాలు బయటకు రాకూడదని టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దుయ్యబట్టారు. ఇలా చేస్తే ఎవరికి లాభం అన్నది అందరికీ అర్థం అవుతొందని, ఇవన్నీ దురుద్దేశాలతో రాజకీయాల కోసం చేసినవిగా కనిపిస్తున్నాయని విమర్శించారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబు ఒక్కడికే తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని కేసుల్లో మీ పాత్ర ఉందని తాము చెప్పలేదని, కొన్నింటిలో మీ పాత్ర ఉందని, తాము కావాలనుకుంటే లోకేష్ మీద కేసు పెట్టలేమా అని ప్రశ్నించారు. అఖిలప్రియ కేసులో స్పందనే లేదని, కానీ ఈ 9 కేసులపై మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 9 కేసుల్లో ఉన్న వారు మీవారు కాదని గుండెలపై చెయ్యి వేసుకుని చెప్పగలరా అని నిలదీశారు. దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేసిన నీచ చరిత్ర చంద్రబాబుదని, విగ్రహాలు పగలగొట్టొచ్చు కానీ వాస్తవాలు బయటకు వస్తుంటే నారా వారి నరాల్లో వణుకు పుడుతోందని ఎద్దేవా చేసారు. భగవంతుడితో ఆడుకున్న వారు ఎవరూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదన్నారు.

Latest News

 
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM