పేలిన అగ్నిపర్వతం.. ఎగిసిపడుతున్న మంటలు

by సూర్య | Sun, Jan 17, 2021, 12:58 PM

ఇండోనేషియాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిపర్వతం బద్దలైంది. తూర్పు జావాలో సుమేరు అగ్నిపర్వతం పేలినట్లుగా సమాచారం అందుతోంది. దీంతో భారీ ఎత్తున బూడిదను పడుతున్నట్లుగా చెప్తున్నారు. ఆకాశం వైపు సుమారు 5,6 కిలోమీటర్ల మేర ఈ బూడిద ఎగిసిపడుతున్నట్లు తెలుస్తోంది. ఇండోనేషియాలో సుమారుగా 130 వరకు అగ్నిపర్వతాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో ఘోరమైన భూకంపంలో 49 మంది మరణించిన కొద్ది రోజులకే ఈ ప్రమాదం చోటు చేసుకోండం అందర్నీ కలచివేస్తోంది. ఇండోనేషియా దేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ద్వీపమైన జావాలో ఇప్పటి వరకు తరలింపు ఉత్తర్వులు జారీ కాలేదు. కాని పర్వత వాలుపై నివసిస్తున్న గ్రామస్తులు ఈ అగ్నిపర్వతం విషయంలో అప్రమత్తంగా ఉండాలని జాతీయ విపత్తు సంస్థ హెచ్చరించింది.

Latest News

 
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM
మూడు నెలల్లో రెండు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ సొంత జిల్లాలోనే! Mon, Apr 29, 2024, 08:06 PM
టీడీపీకి భారీ ఊరట.. ఆ నియోజకవర్గాల్లో నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న రెబల్ అభ్యర్థులు Mon, Apr 29, 2024, 08:02 PM