పీఎం కిసాన్ సాయం రూ.10 వేలకు పెంపు?

by సూర్య | Sat, Jan 16, 2021, 05:29 PM

2018లో పీఎం కిసాన్ పథకం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 4 నెలలకు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఇచ్చే సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచనునట్టు వార్తలు వస్తున్నాయి. "ఇండియా టీవీ" న్యూస్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ లో రైతుల పై కేంద్రం వరాల జల్లు కురిపించనుందని తెలుస్తోంది.
అందులో భాగంగా పీఎం కిసాన్ కింద అందించే సాయం రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచనున్నారని ఆ వార్త సారాంశం. ముందుగా నిర్మలా సీతారామన్ ప్రతిపాదిస్తారని ఆ తర్వాత దానిని పార్లమెంట్ ఆమోదంతో అమలు చేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఒక వేళ నిజంగానే సాయాన్ని పెంచితే మాత్రం దేశ వ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు లాభం చేకూరుతుంది. దీనికి సంబంధించిన క్లారిటి మాత్రం బడ్జెట్ సమావేశాలలోనే వస్తుంది.
పీఎం కిసాన్ పథకాన్ని ఇలా అప్లై చేయవచ్చు. ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయడానికి భూమి పత్రాలు, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, అడ్రస్ ప్రూఫ్, మొబైల్ నెంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కావాలి.
ముందుగా https://pmkisan.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Farmers corner సెక్షన్‌లో New Farmer Registration పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నెంబర్, ఇమేజ్ టెక్స్ట్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత వివరాలన్నీ ఎంటర్ చేసి దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ వస్తుంది.
ఆ రిఫరెన్స్ నెంబర్‌తో అప్లికేషన్ ట్రాక్ చేయొచ్చు.
పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేయడంలో ఏవైనా సమస్యలు ఉంటే 155261 లేదా 1800115526 లేదా 011-23381092 నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు మరియు వివరాలు తెలుసుకోవచ్చు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM