అవన్నీ సురక్షితమేనన్న కేంద్రం

by సూర్య | Sat, Jan 16, 2021, 04:53 PM

దేశంలో బర్డ్ ఫ్లూ క్రమంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు పది రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రల్లో ఫ్లూను నిర్ధారించినట్లు వెల్లడించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలకు సూచనలు చేసింది. నీటి కుంటలు, పక్షుల మార్కెట్లు, 'జూ'లు, పౌల్ట్రీ ఫాంలపై పర్యవేక్షణ పెంచాలని స్పష్టం చేసింది. ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడాలని తెలిపింది.
ఇటువంటి సమయంలో మత్స్య, పశుసంవర్ధక మరియు పాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బర్డ్ ఫ్లూ వ్యాప్తిని దేశం సమర్థవంతంగా నియంత్రిస్తోందని పేర్కొంది. ఏవియన్ ఇన్ ఫ్లూఎంజా రహిత ప్రాంతాలు / రాష్ట్రాల నుంచి లభించే పౌల్ట్రీ, పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకాలను అనుమతించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. "దేశం ఈ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రిస్తోంది. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వైరస్ సులభంగా నాశనం అవుతుందని కనుగొన్నాం. అందువల్ల, సరిగ్గా వండిన పౌల్ట్రీ మరియు పౌల్ట్రీ ఉత్పత్తులు సురక్షితం. వాటి వల్ల మానవులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వాటిల్లవు" అని మత్స్య, పశుసంవర్ధక మరియు పాల మంత్రిత్వ శాఖ (FAHD ) ప్రకటన ద్వారా తెలియజేసింది.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM