మాజీ కేంద్రమంత్రి కమల్‌ మొరార్క కన్నుమూత

by సూర్య | Sat, Jan 16, 2021, 09:47 AM

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ వ్యాపారవేత్త కమల్ మొరార్కా (74) అనారోగ్యంతో మరణించారు. మొరార్కా 1990-91లో చంద్రశేఖర్‌ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా, 1988-94 మధ్య కాలంలో జనతాదళ్ (సెక్యులర్) పార్టీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2012 నుంచి సమాజ్ వాదీ జనతా పార్టీ (రాష్ట్రీయ) కి నాయకత్వం వహించారు. పారిశ్రామికవేత్త అయిన కేంద్ర మాజీ మంత్రి కమల్ మృతి తీరని లోటని రాజస్థాన్ రాష్ట్ర మాజీ మంత్రి, నవల్‌గఢ్‌ శాసన సభ్యుడు రాజ్‌కుమార్‌ శర్మ సంతాపం తెలిపారు. 1946 జూన్ 18వతేదీన మార్వాడీ కుటుంబంలో జన్మించిన కమల్ పారిశ్రామికవేత్తగా మోరార్కా ఆర్గానిక్ కంపెనీ చైర్మన్‌గా వ్యవహరించారు. కమల్ క్రీడలపై మక్కువతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా, బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. సామాజిక సేవ కార్యకర్తగా ఎన్నో సేవలందించారు. సేంద్రియ వ్యవసాయ సాగుకు ఎంతో కృషి చేశారు. ఎంఆర్ మోరార్కా ఫౌండేషన్‌ను స్థాపించి రెండుదశాబ్దాల పాటు షేఖావతి ఫెస్టివల్ నిర్వహించారు. అలాగే వైల్డ్‌ లైఫ్‌ ఛాయాచిత్రాల పుస్తకాన్ని సైతం ప్రచురించారు. 

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM