రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతీసేలా నిమ్మగడ్డ చర్యలు: బొత్స

by సూర్య | Mon, Jan 11, 2021, 11:41 AM

కరోనా పరిస్థితుల్లో ఎన్నికలు ఎందుకు పెట్టాలో అర్థం కావడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందని ప్రధాని మోదీనే ప్రకటించారని, ఏపీలో కూడా సీఎస్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ పంపిణీ కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ తెలియచేసిన గంట వ్యవధిలోనే షెడ్యూల్ విడుదల చేయడం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందన్నారు. 2018లో పెట్టాల్సిన ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని, ఏపీలో 30 కేసులు కూడా లేనప్పుడు ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేశారని ప్రశ్నించారు. కరోనా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారని, ప్రభుత్వాన్ని కాదని ఎన్నికలు జరుపుతామనడం తానెప్పుడూ చూడలేదన్నారు. ఎవరి స్వార్థం కోసం ఎస్‌ఈసీ పనిచేస్తోందో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కొద్దిరోజులు ఎన్నికలు వాయిదా వేస్తే వచ్చే ఇబ్బంది ఏంటని, ఎస్‌ఈసీ ఒక రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రజల ప్రాధాన్యతను ఎస్‌ఈసీ పట్టించుకోవడం లేదని అన్నారు. తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ఎన్నికలంటే భయపడటం లేదని, ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని పేర్కొన్నారు.

Latest News

 
విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలి Fri, Apr 26, 2024, 06:14 PM
నెల్లూరులో దుర్మార్గం రౌడీయిజాలకు స్థానం లేకుండా చేస్తా Fri, Apr 26, 2024, 06:13 PM
చంద్రబాబు,లోకేష్,పవన్ కల్యాణ్ ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు Fri, Apr 26, 2024, 06:12 PM
దుష్ప్రచారం చేయడం చంద్రబాబుకి అలవాటే Fri, Apr 26, 2024, 06:12 PM
చంద్రబాబు చరిత్రలో పేదవారి గురించి ఇప్పుడైనా ఆలోచించాడా..? Fri, Apr 26, 2024, 06:11 PM