ఈ కార్లపై రూ.40 వేల తగ్గింపు!

by సూర్య | Mon, Jan 11, 2021, 11:24 AM

కొత్త కారు కొనేందుకు సిద్ధమౌతున్నారా? అయితే మీకు అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. కారు కొనుగోలుపై ఏకంగా రూ.40 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే ఇది అన్ని కార్లపై లభించదు. కేవలం డాట్సన్ కార్లపై అదిరిపోయే ఆఫర్లున్నాయి. జనవరి చివరి వరకే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.డాట్సన్ కంపెనీ తన కార్లపై పండుగ ఆఫర్లు అందిస్తోంది. డాట్సన్ గో, డాట్సన్ రెడిగో, డాట్సన్ గో ప్లస్ అనే మోడళ్లపై తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఏకంగా రూ.40 వేల వరకు బెనిఫిట్ లభిస్తోంది. డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ వంటివి ఇందులో కలిసి ఉంటాయి.రెడిగో కారుపై రూ.35,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. రూ.15 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.15 వేల ఎక్స్చేంజ్ బోనస్, రూ.5 వేల కార్పొరేట్ ఆఫర్ ఉంది. దీని ధర ఎక్స్‌షోరూమ్ ధర రూ.2.86 లక్షలు. అలాగే డాట్సన్ గో, గో ప్లస్ కార్లపై కూడా ఇదే ఆఫర్ ఉంది.ఈ రెండు కార్లపై రూ.40 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. క్యాష్ డిస్కౌంట్ రూ.20,000. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.20 వేల తగ్గింపు లభిస్తుంది. డాట్సన్ గో ఎక్స్‌షోరూమ్ ధర రూ.4 లక్షలు. అదే డాట్సన్ గో ప్లస్ ధర రూ.4.25 లక్షలు.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM