విజయనికి చేరువలో టీం ఇండియా

by సూర్య | Mon, Jan 11, 2021, 10:35 AM

బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఓవర్ నైట్ లో రెండు వికెట్లు సమర్పించుకొని 98 పరుగులు చేసిన టీమిండియా ఐదవ రోజు సోమవారం ఇన్నింగ్స్‎ను ప్రారంభించింది.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శనకు తోడు పూజారా క్లాస్ పెర్ఫామెన్స్ తొడవ్వడంతో భారత్ విజయానికి దగ్గర అయ్యింది.


రిషబ్ పంత్ 97 పరుగులు చేసి సెంచరీ తృటిలో చేజార్చుకున్నాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన పంత్.. కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక పూజారా 58 పరుగులతో ఆకట్టుకోవడంతో ఈ ద్వయం అప్పటికే టీమిండియాను పటిష్ట స్థితిలో నిలబెట్టారు. ఇక టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రహానే (4) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు..భారత్ విజయానికి మరో 157 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‎లో 338 పరుగులు చేయగా..భారత్ 244 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‎లో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 312 రన్స్ చేసి టీమిండియా ముందు 407 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటికే జరిగిన రెండు టెస్ట్ లలో చెరో విజయంతో మూడవ టెస్ట్ పై ఇరు జట్లు కూడా కసిగా ప్రదర్శన చేస్తున్న నేపద్యంలో మూడవ టెస్ట్ విజయం ఏ జట్టును వరిస్తుందో చూడాలి.

Latest News

 
షర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు Fri, May 03, 2024, 02:50 PM
మోసపూరిత మాటలు నమ్మవద్దు: ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము Fri, May 03, 2024, 02:46 PM
విద్యుత్ నియంత్రికలో మంటలు.. రూ. 8 లక్షల నష్టం Fri, May 03, 2024, 02:45 PM
పెనగలూరు మండలంలో జోరుగా సాగుతున్న కూటమి ప్రచారం Fri, May 03, 2024, 02:10 PM
వడదెబ్బకు నెలటూరు గ్రామ వాసి మృతి Fri, May 03, 2024, 02:09 PM