భారీ స్కోర్‌ దిశగా ఆస్ట్రేలియా

by సూర్య | Sun, Jan 10, 2021, 09:47 AM

 భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. ఆదివారం 103/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు తొలి సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయి మరో 79 పరుగులు చేసింది. దీంతో భోజన విరామ సమయానికి ఆ జట్టు స్కోర్‌ 182/4గా నమోదైంది. క్రీజులో స్మిత్‌(58), గ్రీన్‌(20) ఉన్నారు. ప్రస్తుతం 276 పరుగుల ఆధిక్యంలో ఉంది.


అంతకుముందు లబుషేన్‌(73), స్మిత్‌ మూడో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఈ క్రమంలోనే వారిద్దరూ కుదురుకున్నట్లే కనిపించినా సైని ఓ చక్కటి బంతితో లబుషేన్‌ను బోల్తా కొట్టించాడు. అతడు వేసిన 47వ ఓవర్‌ తొలి బంతి ఎడ్జ్‌ తీసుకొని కీపర్‌ చేతుల్లో పడడంతో ఆసీస్‌ 138 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. అనంతరం మాథ్యూవేడ్‌ (4) సైతం అచ్చం అలాగే ఔటయ్యాడు. సైని బౌలింగ్‌లోనే వికెట్ల వెనుక సాహాకు దొరికిపోయాడు. అప్పటికి ఆ జట్టు స్కోర్‌ 148/4గా నమోదైంది. అనంతరం‌ గ్రీన్‌తో జోడీ కట్టిన స్మిత్‌ భారీ స్కోర్‌ దిశగా దూసుకుపోతున్నాడు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM