సిడ్నీ టెస్ట్‌లో రోహిత్ శ‌ర్మ అరుదైన రికార్డు

by సూర్య | Fri, Jan 08, 2021, 01:50 PM

సిడ్నీ:  చాలా రోజుల త‌ర్వాత టీమ్‌లోకి తిరిగొచ్చిన రోహిత్ శ‌ర్మ‌.. సిడ్నీ టెస్ట్ తొలి  ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయ‌లేదు కానీ ఓ అరుదైన రికార్డు మాత్రం అందుకున్నాడు. ఇన్నింగ్స్ 16వ ఓవ‌ర్లో నేథ‌న్ ల‌య‌న్ వేసిన బాల్‌ను లాంగాన్ మీదుగా సిక్స్ కొట్టాడు రోహిత్‌. ఇది ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి రోహిత్ కొట్టిన 100వ సిక్స్ కావ‌డం విశేషం. ఇంత వ‌ర‌కూ ఏ ఇత‌ర క్రికెట‌ర్ కూడా ఆస్ట్రేలియాపై 100 సిక్స‌ర్లు బాద‌లేదు. వ‌న్డేల్లోనే ఆసీస్‌పై రోహిత్ 63 సిక్స్‌లు కొట్టాడు. ఈ సిక్స్‌తో ఇంటర్నేష‌న్ క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ సిక్స‌ర్ల సంఖ్య 424కు చేర‌డం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ ఇండియ‌న్ క్రికెట‌ర్‌కూ సాధ్యం కాని రికార్డు ఇది. 


రోహిత్ కంటే ముందు ఇద్ద‌రే


ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన వాళ్ల‌లో రోహిత్ కంటే ముందు ఇద్ద‌రు క్రికెట‌ర్లు ఉన్నారు. అందులో ఒక‌రు విండీస్ విధ్వంస‌క బ్యాట్స్‌మ‌న్ క్రిస్ గేల్ (534 సిక్స‌ర్లు) కాగా.. మ‌రొక‌రు పాకిస్థాన్ బ్యాట్స్‌మ‌న్ షాహిద్ అఫ్రిది (476 సిక్స‌ర్లు). ఒక ప్ర‌త్య‌ర్థిపై వంద సిక్స్‌లు కొట్టిన రెండో ప్లేయ‌ర్ రోహిత్‌. ఇంత‌కుముందు ఇంగ్లండ్‌పై అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి గేల్ 140 సిక్స‌ర్లు కొట్టాడు.


ఆస్ట్రేలియాపై సూప‌ర్ రికార్డ్‌


రోహిత్‌కు ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. వ‌న్డేల్లో త‌న తొలి డ‌బుల్ సెంచ‌రీ చేసింది ఆస్ట్రేలియాపైనే. 2013లో బెంగ‌ళూరులో జ‌రిగిన వ‌న్డేలో 209 ప‌రుగులు చేశాడు రోహిత్‌. అందులో ఏకంగా 16 సిక్స‌ర్లు ఉండ‌టం విశేషం. మొత్తంగా ఆస్ట్రేలియాపై 8 సెంచ‌రీల‌తోపాటు 61 స‌గ‌టుతో ప‌రుగులు చేశాడు. 

Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM