ఇండియాలో కొత్తగా 18,139 కరోనా కేసులు

by సూర్య | Fri, Jan 08, 2021, 10:31 AM

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గింది. తాజాగా గురువారం కూడా 18వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో (జనవరి 7న) కొత్తగా 18,139 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 234 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా  కేసుల సంఖ్య 1,04,13,417 కి చేరగా.. మరణాల సంఖ్య 1,50,570 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ  శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


ఇదిలాఉంటే.. కేసులతోపాటు రికవరీల సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతూనే ఉంది. కరోనా నుంచి నిన్న 20,539 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న  వారి సంఖ్య 1,00,37,398 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,25,449 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 96.39 శాతం ఉండగా.. మరణాల రేటు 1.45 శాతం ఉంది.


దేశవ్యాప్తంగా నిన్న 9,35,369 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. వీటితో కలిపి జనవరి 7వ తేదీ వరకు మొత్తం 17,93,36,364 నమూనాలను పరీక్షించినట్లు  ఐసీఎంఆర్ వెల్లడించింది.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM